బంగ్లాదేశ్ లో మైనారిటీలపై దాడులు ఆందోళనకరంగా మారుతున్న వేళ వేర్వేరు ఘటనల్లో ఇద్దరు హిందువులు దారుణ హత్యకు గురయ్యారు. అలీఫ్ చంద్ర దత్తా మహాదేవ్‌పూర్ బజార్‌లోని తన నగల దుకాణం నుంచి ఇంటికి వెళ్తుండగా రాత్రి 9 గంటల సమయంలోకొందరు దుండగులు అతడిని అడ్డుకుని పదునైన ఆయుధంతో దాడి చేశారు. అనంతరం అతడి వద్ద ఉన్న బంగారం, 7 లక్షల బంగ్లాదేశీ టాకాలను దోచుకుని పారిపోయారు. ఇక కాక్స్‌బజార్ జిల్లా మహేశ్‌ఖాలీ ఉపజిల్లాలో 45 ఏళ్ల హిందూ మహిళ రాణి సుశీల్ హత్యకు గురైంది.