తెలంగాణలో విదేశీ మద్యం ధరలు భారీగా పెరిగాయి. బ్రాండ్‌ను బట్టి ఫుల్ బాటిల్‌పై రూ.30 నుంచి రూ.100 వరకు ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సగటున 6 శాతం వరకు ధరల పెంపు ఖరారు చేసారు. పెరిగిన ధరలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. రాష్ట్రంలో ప్రస్తుతం విక్రయిస్తున్న 352 విదేశీ మద్యం బ్రాండ్ల ధరలను ప్రభుత్వం సమీక్షించింది. మద్యం కొనుగోలు చేసే వినియోగదారులపై అదనపు భారం పడనుంది. అన్ని బ్రాండ్లకు ఒకే విధంగా ధరలు పెంచకుండా, బ్రాండ్‌ను బట్టి ధరలను సవరించారు.