జాతీయ జెండాతో జంతర్మంతర్లోకి ప్రవేశించిన సీజేపీ సభ్యులు సౌరవ్ దాస్, అశుతోశ్ రాంకాలను పోలీసులు అరెస్టు చేసి ఐదు రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించాడు. దీనిపై ప్రకాశ్ రాజ్ తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. కేంద్ర ప్రభుత్వ తీరును, జంతర్మంతర్ను నిరసన వేదికగా డీనోటిఫై చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టాడు. ప్రభుత్వాలు నిరసన వేదికలను మార్చగలవేమో కానీ, ఈ దేశ ప్రజల గొంతును ఎప్పటికీ అణచివేయలేవని అతడు హెచ్చరించారు. ప్రజాస్వామ్య హక్కులను కాలరాసే చర్యలను ప్రజలు సహించబోరని ప్రకాశ్ రాజ్ వెల్లడించాడు.