రాజ్యాంగ సంస్థలపై దుష్ప్రచారంపై హార్వర్డ్ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగ సంస్థలపై జరుగుతున్న దాడిపై హార్వర్డ్ విశ్వవిద్యాలయ విద్యార్థులు, పరిశోధకులు స్పందించారు. రాజకీయ ప్రయోజనాల కోసం తగిన అనుమతులు లేకుండా, రాజకీయ లబ్ధి కోసం తమ విశ్వవిద్యాలయ పేరును వాడుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు హార్వర్డ్ లా, మెడికల్, బిజినెస్, కెన్నెడీ స్కూళ్లకు చెందిన భారతీయ విద్యార్థులు ప్రకటన విడుదల చేశారు. రాజ్యాంగం, చట్టబద్ధత, పౌర స్వేచ్ఛలను గౌరవించాలని హార్వర్డ్ ప్రతినిధుల బృందం స్పష్టం చేసింది.

