మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్ జిల్లాకు చెందిన బిట్టూ తబాహి ఎలాంటి ఆధునిక యంత్రాలు, ప్రభుత్వ సాయం లేకుండానే నదిలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తను తొలగించేందుకు ఎనిమిది నెలల పాటు శ్రమించినట్లు కథనం పేర్కొంది. అయితే, ఇటీవల నదీ తీరానికి వెళ్లిన అతడికి అక్కడ మళ్లీ చెత్త పేరుకుపోవడం కనిపించింది. నది దుస్థితిని చూసి బిట్టూ తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఈ దృశ్యాలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పంచుకుంటూ, ఎనిమిది నెలల శ్రమ ఇలా వృథా అవుతుందని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.