కుటుంబ కలహాల పగతో రగిలిపోయిన ఓ మాజీ సర్పంచ్ మొదటి భార్య, తన భర్త, అత్తతో సహా ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని నరికి చంపింది. ఆపై ఆ హత్యలను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు మృతదేహాలను స్కార్పియో కారులో వేసి సజీవ దహనం చేసింది. మే 28న ఉదయం అజ్మీర్ హైవేపై ఓ స్కార్పియో కారు మంటల్లో తగులబడటాన్ని రోడ్డు ప్రమాదంగా భావించినప్పటికీ, వారి ఫామ్‌హౌస్‌ను పరిశీలించిన పోలీసులకు అక్కడ భారీగా రక్తపు మరకలు కనిపించడంతో ఇది పక్కా స్కెచ్‌తో జరిగిన హత్యగా తేల్చారు.