పార్వతీపురం మన్యం జిల్లాలోని సీతంపేట ఏజెన్సీ ఘాట్ రోడ్డుపై పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. వాహనంలో ఉన్న 40 మంది ప్రయాణికులలో 17 మందికి గాయాలు అయ్యాయి.
స్థానికులు వెంటనే క్షతగాత్రులను సీతంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో నీలమ్మ అనే మహిళ పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వైద్యులు ఆమెకు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు.