ఆపరేషన్ సింధూర్ వార్షికోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సోషల్ మీడియా (X) డీపీని ‘ఆపరేషన్ సింధూర్’ లోగోగా మార్చి సైనికుల పట్ల తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. “మన సైన్యం చూపిన అసమాన ధైర్యం, సంకల్పం ఉగ్రవాదంపై భారత్ వైఖరిని స్పష్టం చేసింది. ఉగ్రవాదాన్ని ఓడించే విషయంలో మా సంకల్పం అచంచలం” అని మోదీ ఉద్ఘాటించారు. రక్షణ రంగంలో మనం సాధించిన స్వావలంబనే నేడు జాతీయ భద్రతకు శ్రీరామరక్ష అని ఆయన పేర్కొన్నారు.