తెలంగాణలో ప్రస్తుతం స్వతంత్రంగా ఉన్న ఇంటర్మీడియట్ బోర్డును రద్దు చేసి, దానిని పాఠశాల విద్యాశాఖలో విలీనం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. విద్యా వ్యవస్థలో సమూల మార్పుల కోసం నియమించిన విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళి ఈ మేరకు ప్రభుత్వానికి కీలక ప్రతిపాదనలు సమర్పించారు. 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు ఒకే గొడుగు కిందకు తీసుకురావడం ద్వారా విద్యా పరిపాలనను మరింత సులభతరం చేయవచ్చని కమిషన్ అభిప్రాయపడుతోంది.