సూర్యాపేట జిల్లా కోదాడ పరిధిలోని దొరకుంట వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డీసీఎం వాహనాన్ని ఢీకొట్టింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. తెల్లవారుజామున డ్రైవర్ నిద్రమత్తు రావడంతో బస్సు అదుపుతప్పి ముందువెళ్తున్న డీసీఎంను బలంగా ఢీ కొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ పాటు పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి.