జనసేనతో పొత్తుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ శాఖ అధ్యక్షుడు శంకర్ గౌడ్ క్లారిటీ ఇచ్చారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవాలా.. లేదా.. అనేది పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, బీజేపీ అధిష్ఠానం చూసుకుంటుందన్నారు. అది జాతీయ నాయకత్వం పరిధిలోని అంశమని, బీజేపీతో పొత్తు లేకపోయినా తెలంగాణలో జనసేన ఒంటరిగానే బరిలోకి దిగుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో తమ పార్టీకి ఆదరణ పెరుగుతోందన్నారు. జీహెచ్ఎంసీ సహా రాబోయే ఏ ఎన్నికల్లో అయినా పోటీ చేసేలా తాము కార్యాచరణ చేపడుతున్నామని వివరించారు.