విమర్శలు హుందాగా చేయాలని, హద్దు మీరి నోరు పారేసుకుంటే ఇళ్లకు వచ్చి కొడతామని వైసీపీ నేత పేర్ని నానికి, ఆ పార్టీ నాయకులకు టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాలపై వైసీపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. నిరసనల పేరుతో రోడ్లపైకి వచ్చి ఇష్టం వచ్చినట్లు బూతులు తిడితే చూస్తూ ఊరుకునేది లేదని, డీఎస్సీపై చర్చకు సిద్ధమని సవాల్ చేస్తే ఎందుకు ముందుకు రాలేదని ప్రశ్నించారు