అమరావతి చిత్రకళా వీధి ప్రారంభోత్సవంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గన్ మెన్, జనసేన నాయకుడు బోనబోయిన శ్రీనివాస్ మధ్య తోపులాట జరగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నాయకులతో పాటు వస్తున్న జనసేన నేత బోనబోయిన శ్రీనివాస్ ను డిప్యూటీ స్పీకర్ గన్ మెన్ అడ్డుకుని పక్కకు నెట్టివేశారు. ఈ చర్యతో ఆగ్రహం వ్యక్తం చేసిన జనసేన కార్యకర్తలు, మంత్రి గన్ మెన్లు సదరు రక్షణ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.జనసేన కార్యకర్తలు డిప్యూటీ స్పీకర్ గన్ మెన్ ను పక్కకు నెట్టివేయడంతో వాతావరణం మరింత వేడెక్కింది.