యూపీఐ చెల్లింపులపై సేవారూపంలో అదనపు ఛార్జీలు పడతాయేమోనని గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి ఎట్టకేలకు తెరపడింది. డిజిటల్ లావాదేవీలు జరిపే సామాన్య వినియోగదారులకు రూపాయి కూడా ఖర్చు పెరగదని, టీ నుంచి వేల రూపాయల కొనుగోళ్ల వరకు యూపీఐ సేవలు ఎప్పటిలాగే పూర్తి ఉచితంగానే అందుబాటులో ఉంటాయని ఫోన్‌పే సీఈఓ సమీర్ నిగమ్ తేల్చిచెప్పారు. సర్వీస్ ఛార్జీలపై వ్యాపించిన గందరగోళాన్ని పటాపంచలు చేస్తూ, సామాన్యులకు ఎలాంటి భయం అక్కర్లేదని ఆయన స్పష్టమైన గ్యారెంటీ ఇచ్చారు.