అర్నబ్ తుపాను సృష్టించిన విధ్వంసం మరువక ముందే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. నిన్న దక్షిణ అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇవాళ ఉదయం అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా పయనించి, రాబోయే 24 గంటల్లో దక్షిణ అండమాన్ సముద్రం, దానిని ఆనుకుని ఉన్న అండమాన్, నికోబార్ దీవుల పరిసరాల్లో స్పష్టమైన అల్పపీడనంగా మారే అవకాశం ఉంది.