ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నియామక పరీక్షల షెడ్యూలు ఖరారైన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేయబోమని టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం స్పష్టం చేశారు. ఒకే రోజున రెండు వేర్వేరు నియామక సంస్థల పోటీ పరీక్షలు ఉంటే ఆయా పరీక్షలు రాసే అభ్యర్థులకు ప్రత్యామ్నాయ తేదీల్లో రాయడానికి అవకాశం కల్పిస్తామని తెలిపారు. ఇప్పటికే ఏఈఈ పరీక్షలకు ఈ వెసులుబాటు ఇచ్చామన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల పీఎస్సీలను అధ్యయనం చేసి ప్రశ్నపత్రం తయారీ నుంచి ఫలితాల వెల్లడి వరకు సంస్కరణలు అమలు చేస్తున్నామని ఛైర్మన్ చెప్పారు.