ఒక్క రాత్రిలో కాకినాడ, కోనసీమ జిల్లాల్లోని మత్స్యకారుల జీవితాలను తలకిందులు చేసింది అర్నబ్ తుపాను. గతంలో ఎన్నడూ లేనంతగా లక్షల విలువ చేసే బోట్లు ధ్వంసం కాగా నష్టం కోలుకోలేని దెబ్బతీసింది. శ్రమ పడి కూడబెట్టుకున్న ఆస్తులు కళ్లముందే ధ్వంసమవడంతో గంగపుత్రులు కన్నీరు పెడుతున్నారు. తమకు కావాల్సింది తాత్కాలిక పరామర్శ కాదని బతుకును నిలబెట్టే భరోసా కావాలని మత్స్యకారులు అంటున్నారు. లక్షల విలువైన బోట్లు విరగడంతో తమకు పరిహారం అందించాలని దెబ్బతిన్న వేట సామగ్రిని సమకూర్చుకోవడానికి ఆర్థిక సాయం చేయాలని వారు కోరుతున్నారు.