చారిత్రక హిమాయత్‌సాగర్ జలాశయం నీళ్లు అక్రమార్కులకు ఆదాయ వనరుగా మారాయి.జలాశయం చుట్టూ అక్రమంగా బోర్లు వేసి నీటిని తోడేయడమే కాకుండా జలాశయం దిగువన లీకవుతున్న నీటిని సైతం వదలకుండా మోటార్లతో తోడేస్తూ ట్యాంకర్ల ద్వారా విక్రయిస్తూ జేబులు నింపుకొంటున్నారు. ఒక్కో ట్యాంకర్ నుంచి వెయ్యి నుంచి రెండు వేల రూపాయలు, 20 వేల లీటర్ల ట్యాంకర్‌కు రూ.10 వేలు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ఈ వ్యవహారాన్ని అడ్డుకోవాల్సిన అధికారుల కనుసన్నల్లోనే ఈ అక్రమ నీటి దందా సాగుతుందన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

