నాలుగు ప్రముఖ రాష్ట్రాల్లోని 28 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాల్లో ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవకపోవడంపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యంగ్యంగా స్పందించిన సంగతి తెలిసిందే. బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలు నిర్వహించినా కాంగ్రెస్కు ఎన్ని సీట్లు వచ్చాయన్నట్లు ప్రశ్నించారు. ఈవీఎంల వల్ల ఎన్నికల ఫలితాల్లో ఎలాంటి ప్రభావం ఉండదని ప్రధాని నిజంగా నమ్మితే, భవిష్యత్తులో జరిగే అన్ని లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు అన్నింటినీ బ్యాలెట్ పేపర్లతోనే నిర్వహిస్తామని ప్రకటించాలని కాంగ్రెస్ సవాల్ చేసింది.

