హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఫేస్ బుక్ ఆఫీస్ పై ఇండియన్ యూత్ కాంగ్రెస్ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. లోపలికి చొచ్చుకెళ్లి పూలకుండీలు, కొంత ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ఇండియన్ యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఉదయ్ భాను, యూత్ కాంగ్రెస్ ఇన్ఛార్జి మణిశర్మ ఫేస్ బుక్ ఖాతాలను మెటా సస్పెండ్ చేయడంపై భగ్గుమన్నారు. మెటా తీరుపై దేశ వ్యాప్తంగా యూత్ కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు. ఏడు రోజుల్లోగా సస్పెండ్ చేసిన ప్రతిపక్ష నాయకులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, జర్నలిస్టుల అకౌంట్లను పునరుద్ధరించాలని అల్టిమేటం ఇచ్చింది.