YSRCP ఉనికిని కోల్పోయిందని, అది కేవలం ఇంకా బతికే ఉన్నామనే భ్రమలో తిరుగుతున్న ఒక ‘చనిపోయిన పార్టీ’ అని కొణిదెల నాగబాబు తీవ్ర స్థాయిలో విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అత్యధిక మెజారిటీతో సాధించిన విజయాలే నిదర్శనమని పేర్కొన్నారు.కోట్లాది మంది సామాన్య ప్రజలు కూటమి ప్రభుత్వ వైపు నిలబడ్డారని,వైసీపీ వెంట కేవలం పది ఇరవై మంది రౌడీ శక్తులు మాత్రమే మిగిలారని ఎద్దేవా చేశారు. రాబోయే మరో పదిహేనేళ్ల కూటమి ప్రభుత్వమే అధికారంలో కొనసాగుతుందని నాగబాబు ధీమా వ్యక్తం చేశారు.