ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా యుద్ధాలు, అశాంతి గురించే చర్చ జరుగుతున్న తరుణంలో, భారత్ మాత్రం నాగరికతల మధ్య అనుసంధానంపై చర్చలు జరపడం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందని పేర్కొన్నారు. ప్రపంచ శాంతికి సాంస్కృతిక బంధమే అత్యంత బలమైన భరోసా (గ్యారెంటీ) అని ఆయన స్పష్టం చేశారు. కొన్ని నెలల క్రితమే షాంఘై సహకార సంస్థ (SCO) ఏర్పడి 25 ఏళ్లు పూర్తి చేసుకుందని గుర్తుచేసిన మోదీ, గడిచిన పాతికేళ్లలో భద్రత, ఆర్థిక వ్యవస్థ, కనెక్టివిటీ రంగాల్లో సభ్య దేశాల మధ్య సహకారం ఎంతో బలపడిందని తెలిపారు.