జిల్లా పరిషత్ తొలి చైర్‌పర్సన్ పదవి కేటాయింపులో మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. తన కుమార్తె డాక్టర్ పనబాక చేతనకు తిరుపతి జడ్పీ చైర్‌పర్సన్ పదవి ఇస్తామంటూ హామీ ఇచ్చిన టీడీపీ అధిష్టానం మొండిచేయి చూపింది. కూటమి నేతల కసరత్తు అనంతరం చేతనను పక్కన పెట్టి, సత్యవేడు మాజీ ఎమ్మెల్యే, నాగలాపురం జెడ్పీటీసీ హేమలతను తిరుపతి జడ్పీ చైర్‌పర్సన్ అభ్యర్థిగా ఖరారు చేసింది. తిరుపతి ZP తొలి చైర్‌పర్సన్ అభ్యర్థిగా పనబాక చేతన తీవ్రంగా ప్రయత్నించారు.