ఆంధ్రప్రదేశ్ ఖనిజ అభివృద్ధి సంస్థ (APMDC)ని అత్యున్నత స్థాయి మైనింగ్ సంస్థగా తీర్చిదిద్దేలా సమగ్ర కార్యాచరణ రూపొందించాలని ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ మేరకు ఉండవల్లిలోని తన క్యాంపు ఆఫీస్ లో మైనింగ్ శాఖపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. అలాగే రాష్ట్రంలో కొత్త ఖనిజ నిక్షేపాల గుర్తింపు, వినియోగం తదితర అంశాలను సుదీర్ఘంగా చర్చించారు. ఖనిజ నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఏపీ రేర్ ఎర్త్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APREDC) ఏర్పాటుకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు.