ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రేఖా నాయక్ కు ED భారీ షాక్ ఇచ్చింది. రేఖా నాయక్ నివాసాల్లో ఈడీ అధికారులు శుక్రవారం ఉదయం నుంచి మెరుపు దాడులు నిర్వహిస్తున్నారు. మొత్తం రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఈడీ బృందాలు ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. రూ.40.96 కోట్ల విలువైన కస్టమ్ మిల్లింగ్ రైస్ (CMR) ధాన్యం అక్రమాల కేసు నేపథ్యంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. రేఖా నాయక్ ‘ఏఆర్ఎస్ ఇండస్ట్రీస్’ రైస్ మిల్లులో గతంలో భారీ స్థాయిలో ధాన్యం మాయమైన సంగతి తెలిసిందే.