కడప జిల్లా పరిషత్ చైర్మన్ పదవి కేటాయింపు వ్యవహారం బీజేపీలో రాజకీయ చిచ్చు రేపుతోంది. తమ కుటుంబానికి జెడ్పీ చైర్మన్ పదవి ఇస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చినా.. చివరకు ఆ పదవిని టీడీపీకే కేటాయించడంపై బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో నారా లోకేష్ తనకు వెన్నుపోటు పొడిచారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆదినారాయణ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారంటూ ప్రచారం సాగడంతో రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది.