తెలంగాణలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో ప్రజలు చలితో ఇబ్బందులు పడుతున్నారు. ఈ సీజన్లో తొలిసారిగా కొన్ని ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ కంటే దిగువకు చేరాయి. సంగారెడ్డి జిల్లా సత్వార్‌లో 9.6 డిగ్రీలు, కోహిర్లో 9.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇతర ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు తగ్గాయి. కామారెడ్డి జిల్లా డోంగ్లీలో 10.5 డిగ్రీలు, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో 10.7 డిగ్రీలు, వికారాబాద్ జిల్లా బషీరాబాద్‌లో 11 డిగ్రీలు నమోదయ్యాయి.

