ఎలన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్‌కు ముకేశ్ అంబానీ రిలయన్స్ జియో గట్టి పోటీ ఇవ్వనుంది. భారతదేశంలో సొంత శాటిలైట్ ఇంటర్నెట్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడంలో భాగంగా 1600 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపాలని రిలయన్స్ ప్లాన్ చేస్తోంది. 2035 నాటికి శాటిలైట్ నెట్‌వర్క్‌ను పూర్తిగా అందుబాటులోకి తీసుకురావాలని రిలయన్స్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇంత భారీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసే సామర్థ్యం ప్రస్తుతం భారత అంతరిక్ష రంగానికి తక్కువే. కాబట్టి దేశీయ శాటిలైట్ తయారీదారులు, బడా పారిశ్రామిక సంస్థలతో కలిసి పనిచేయాలని కంపెనీ భావిస్తోంది.