ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా పాకిస్థాన్‌కు చెందిన ఓ మంత్రి భారత్‌లో పర్యటిస్తున్నారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) తొలి సివిలైజేషన్ డైలాగ్ ఫోరంలో పాల్గొనేందుకు పాకిస్థాన్ మంత్రి ముసాదిక్ మసూద్ మాలిక్ నవంబర్ 20న దిల్లీ చేరుకున్నారు. భారత పర్యటన సందర్భంగా ఆగ్రాలోని తాజ్‌మహల్, దిల్లీలోని నిజాముద్దీన్ దర్గాల్ని సందర్శించేందుకు అనుమతి ఇవ్వాలని ముసాదిక్ మాలిక్ భారత ప్రభుత్వాన్ని కోరారు. అయితే ఎస్సీఓ సమావేశం మినహా ఇతర ఏ కార్యక్రమాలకు, వేరే ప్రాంతాల సందర్శనకు అనుమతి లేదని కేంద్రం స్పష్టం చేసింది.