తమిళనాడులోని తిరుప్పరంకుండ్రం కార్తీక దీపం వివాదంపై సుప్రీం కోర్టు శుక్రవారం కీలక ఆదేశాలు వెలువరించింది. నవంబరు 24న పౌర్ణమి రోజు కొండపై కార్తీక దీపాన్ని వెలిగించేందుకు అనుమతినిచ్చింది. ఈ తాత్కాలిక అనుమతి అనేది కొండపై ఎలాంటి శాశ్వత హక్కులను కల్పించదని కూడా ధర్మాసనం తేల్చిచెప్పింది. భక్తులు గానీ, స్థానికులు గానీ కొండపైకి వెళ్లకుండా స్పష్టమైన ఆంక్షలు విధించింది.. ధర్మాసనం దేవస్థానం తరఫున అధికారికంగా ఎంపిక చేసిన వ్యక్తులు, సంబంధిత ప్రభుత్వ అధికారులు మాత్రమే కొండ పైభాగంలో ఉన్న దీపత్తూన్ వద్దకు వెళ్లాలని ఆదేశించింది

