దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థల పనితీరుపై ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ లో ఆందోళన వ్యక్తం చేసిన రేణుకా చౌదరి, ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల ఎంపిక కమిటీ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తిని తొలగించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఎవరైనా పంచె కట్టుకుని వస్తే మీరు ఓట్లు వేస్తారా? అని ప్రశ్నిస్తూ, ఇలాంటి కాస్ట్యూమ్ డ్రామా ద్వారా దక్షిణాది ప్రజల తెలివితేటలను అవమానించే ప్రమాదం ఉందని, దక్షిణాది వారితో ఇలాంటి టోకనిజం చేయవద్దని హితవు పలికారు.