<span;>పల్నాడు జిల్లా నరసారావుపేటలోని కోడెల శివప్రసాదరావు స్టేడియంలో రుణమేళా కార్యక్రమం ప్రారంభమైంది. ఇందులో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈసందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తమ ప్రభుత్వ హయాంలో ప్రజల వద్దకే వెళ్లి బ్యాంకులు రుణాలు అందజేస్తున్నాయన్నారు. ఈసందర్భంగా విద్యార్థినులకు 301 సైకిళ్లు పంపిణీ చేశారు. దివ్యాంగులకు నిర్మలా సీతారామన్ ట్రైసైకిళ్లు అందజేశారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు