హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్‌లో దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత ప్యాసింజర్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ విజయంతో ప్రపంచంలోనే హైడ్రోజన్ రైళ్లు నడుపుతున్న కొన్ని ప్రత్యేక దేశాల జాబితాలో భారతదేశం చేరింది. పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో రూపొందిన ఈ రైలు జింద్ – సోనిపట్ మధ్య ఉన్న మార్గంలో ప్రయాణిస్తుంది.ఈ రైలు గరిష్టంగా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా డిజైన్ చేశారు.
భవిష్యత్తు అంతా హైడ్రోజన్ దేనని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు.

