త్వరలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందే కేంద్ర కేబినెట్ ప్రక్షాళన ఉంటుందని
హోంమంత్రి అమిత్ షాను ఉప ప్రధానిగా నియమించబోతున్నట్లు జాతీయ మీడియాలో ఇప్పటికే ప్రచారం జరుగుతోంది.
రాబోయే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో హోం మంత్రి అమిత్ షా ఉప ప్రధానిగా నియమితులవుతారన్న వార్తలు నిజమైతే, అది దేశ ప్రయోజనాల దృష్ట్యా స్వాగతించదగిన నిర్ణయం అవుతుందంటూ సాయిరెడ్డి ఇవాళ ట్వీట్ చేశారు.ఒకప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ నిర్వహించిన పదవిని ఆయన చేపట్టడం కూడా ఎంతో సముచితంగా ఉంటుందని సాయిరెడ్డి ప్రశంసల జల్లు కురిపించారు.

