పసిఫిక్ మహాసముద్రంలో చోటుచేసుకుంటున్న భారీ మార్పులు ప్రపంచవ్యాప్తంగా పర్యావరణవేత్తలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. సుమారు 14,500 కిలోమీటర్ల మేర విస్తరించిన ఒక భారీ ఎల్ నినో కెల్విన్ వేవ్ పసిఫిక్ మీదుగా వేగంగా కదులుతున్నట్లు నాసాకు చెందిన అత్యాధునిక సెంటినెల్-6 శాటిలైట్ గుర్తించింది. 1997, 2015 సంవత్సరాల్లో సంభవించిన తీవ్రమైన వాతావరణ పరిస్థితుల తరహాలోనే ఈసారి కూడా ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే ప్రమాదం పొంచి ఉంది. ఎల్ నినో ముప్పు భారత్ కు వెన్నెముక లాంటి నైరుతి రుతుపవనాలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది.