ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి భారీ వర్షాలకు వాతావరణం అనుకూలంగా మారుతోంది. వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా–పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలపై ఏర్పడిన బాగా గుర్తించబడిన అల్పపీడనం కొనసాగుతోందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం డైరెక్టర్ తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. ముఖ్యంగా శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పోలవరం ప్రాంతాల్లో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.