ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం పల్లెపాలెం సముద్ర తీరంలో మంగళవారం అర్ధరాత్రి ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మత్స్యకారులకు చెందిన చేపల వలలకు అకస్మాత్తుగా మంటలు అంటుకుని, పెద్ద ఎత్తున ఎగసిపడ్డాయి. వలలన్నీ ఒకే చోట గుట్టలుగా పోసి ఉండటంతో మంటలు చాలా వేగంగా వ్యాపించాయి. వలలకు దానంతట అవే మంటలు ఎలా అంటుకున్నాయనే దానిపై మత్స్యకారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగానే నిప్పు పెట్టి ఉంటారని ఆరోపిస్తున్నారు. ప్రమాదంలో కాలిపోయిన వలల విలువ దాదాపు రూ.2 కోట్లకు పైగానే ఉంటుందని మత్స్యకారులు కన్నీరుమున్నీరవుతున్నారు.
- 0 Comments
- Prakasam District