మహేంద్ర సింగ్ ధోని భార్య సాక్షి ఎమోషనల్ పోస్టు పెట్టారు. జీవితంలో అందమైన కొత్త ప్రయాణం ప్రారంభం కావాలంటే.. కొన్ని అధ్యాయాలు ముగియాల్సిందేనంటూ ఇన్స్టాలో రాసుకొచ్చారు. ‘‘ఇనేళ్లు మహీని ప్రేమించి, నమ్మిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ప్రేమకు ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాం. కొత్త ఆరంభాలకు.. సరికొత్త సాహసాలకు.. మరెన్నో అందమైన జ్ఞాపకాలకు స్వాగతం. మహీ నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది’’ అంటూ పర్వతాల వైపు చూస్తూ పోజిచ్చిన ధోని ఫొటోను షేర్ చేశారు.