తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సర్వే గడువును కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి పొడిగించింది. నవంబర్ 30వ తేదీన తుది జాబితాను ప్రచురించాల్సి ఉండగా దాన్ని డిసెంబర్ 22 వరకు పెంచింది. అలాగే.. ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్, డూప్లికేట్ (ఏఎస్డీడీ) క్యాటగిరీ ఓటర్ల కోసం ఎన్యూమరేషన్ ఫారాల తయారీ, ముద్రణ ప్రక్రియను నవంబర్ 18లోగా పూర్తి చేయాలని ఈసీ ఆదేశించింది. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణను నవంబర్ 18 నుంచి 30 వరకు చేపట్టాలని పేర్కొంది.

