యాపిల్‌కు చెందిన అనేక ప్లాట్‌ఫామ్‌లు సమస్యలను ఎదుర్కొన్నాయి. యాప్ స్టోర్, యాపిల్ మ్యూజిక్, యాపిల్‌కేర్ ఆన్ డివైస్, ఐక్లౌడ్ అకౌంట్ అండ్ సైన్ ఇన్ సేవల్లో అంతరాయం నమోదైంది. దీంతో యూజర్లు కొత్త యాప్‌లను డౌన్లోడ్ చేసుకోవడం, మ్యూజిక్ స్ట్రీమింగ్ చేయడం, తమ యాపిల్ అకౌంట్లలోకి ప్రవేశించడం వంటి పనులు చేయలేకపోయారు. ఐక్లౌడ్ సేవలపై ఆధారపడే వారికి కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే ఈ అంతరాయం వెనుక సైబర్ దాడి లేదని సంస్థ స్పష్టం చేసింది. పలు సేవల్లో సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు వెల్లడించింది.