పల్నాడు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చేపల వేటకు వెళ్లి ఇద్దరు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన నరసరావుపేట మండలం కాకాని చేపల చెరువు వద్ద చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం గ్రామానికి చెందిన హస్సేన్, పిట్టంబండ్ల హుస్సేన్ బుడేగా అనే ఇద్దరు వ్యక్తులు చేపట్టేందుకు పడవలో వెళ్లారు. ప్రమాదవశాత్తు పడవ బోల్తా పడటంతో ఇద్దరు మృతి చెందారు. గమనించిన స్థానికులు మృతదేహాలను వెలికితీసి పోలీసులకు సమాచారమిచ్చారు.

