కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ తో పాటు రాష్ట్ర గవర్నర్ ప్రతాప్ శుక్లా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పరేడ్ గ్రౌండ్స్ లో కేంద్ర ప్రభుత్వ బలగాలు కవాతు నిర్వహించాయి. వీర సైనిక్ స్మారకం వద్ద జవాన్లకు ఉపరాష్ట్రపతి నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. సైనికుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.