ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ హోదాలో ఉన్న అద్దంకి దయాకర్‌ను వెనుక వరుసలో కూర్చోబెట్టి, ఎలాంటి ప్రభుత్వ హోదా లేని రేవంత్ రెడ్డి అనుచరులను ముందు వరుసలో కూర్చోబెట్టడం చర్చకు దారితీసింది. ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమంలో ఎలాంటి ప్రభుత్వ హోదా లేని వ్యక్తులు రేవంత్ రెడ్డి అనుచరులు ఫహీమ్ ఖురేషి, రోహిన్ రెడ్డి ముందు వరుసలో కూర్చోబెట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది.