ప్రముఖ డాన్స్ మాస్టర్ పండు వైద్య పరీక్షల అనంతరం పండు మాస్టర్ ఎడమ తుంటి ఎముక (హిప్ జాయింట్) జారిపోయినట్లు,
అలాగే రెండు కాళ్ల మోకాళ్ల కింద ఉండే టిబియా, ఫిబులా ఎముకలు విరిగినట్లు గుర్తించారు. తుంటి ఎముకను తిరిగి సరిచేసినట్లు డాక్టర్ తెలిపారు. ప్రస్తుతం పండు మాస్టర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఎటువంటి ప్రాణాపాయ పరిస్థితి లేదని విరిగిన రెండు కాళ్ల ఎముకలకు ఇవాళ సర్జరీలు నిర్వహిస్తామని ఈ సర్జరీలలో ప్లేట్లు లేదా రాడ్లు అమర్చాల్సి ఉంటుందని డాక్టర్ వివరించారు.