ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం శుక్రవారం (అక్టోబర్ 30)తో ముగుస్తోంది. పోటీలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు చివరి రోజు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. గుంటూరు మేయర్ అభ్యర్థిగా కూటమి తరఫున టీడీపీ నుంచి పోటీచేస్తున్న కోవెలమూడి లక్ష్మీ అపర్ణకు మద్దతుగా సినీ నటుడు జగపతిబాబు వీడియోను విడుదల చేశారు. తన చెల్లి లక్ష్మీ అపర్ణతో పాటుగా కూటమి తరఫున కార్పొరేటర్లుగా పోటీచేస్తున్న అభ్యర్థుల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని జగపతిబాబు కోరారు.