కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది. తెలంగాణ సహా ఏపీ, మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా, నాగాలాండ్ లో ‘సర్’ గడువును పొడిగించింది. షెడ్యూల్ ప్రకారం ఓటర్ల నుంచి అభ్యంతరాలను, ఫిర్యాదులను పరిష్కరించడానికి నవంబర్ 5 వరకు అవకాశం ఉండగా, దాన్ని నవంబర్ 26 వరకు పెంచింది. గత షెడ్యూల్ ప్రకారం తుది ఓటర్ల జాబితాను నవంబర్ 9న వెలువరించాల్సి ఉండగా, దాన్ని నవంబర్ 30కి మార్చింది. తెలంగాణలో సర్ గడువును ఒకసారి పొడిగించగా, ఇప్పుడిది రెండోసారి.