నగరంలోని ప్రధాన తాగునీటి ఆధారాలైన మంజీర, సింగూరు జలాశయాల్లో నీటి నిల్వలు అడుగంటిపోవడంతో హైదరాబాద్ సిటీ పరిధిలో మొత్తం 22 నియోజకవర్గాలు ఉండగా.. అందులో మంజీరా పైపులైన్లు ఉన్న 9 నియోజకవర్గాల్లో నీటి సమస్య తీవ్రమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. మంజీరా ఆధారిత ప్రాంతాలైన కూకట్పల్లి, శేరిలింగంపల్లి, పటాన్చెరు, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, కార్వాన్, సనత్నగర్, రాజేంద్రనగర్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో ఇప్పటికే భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. నీటి ఆవిరి, పైపులైన్ల లీకేజీలు పోను ఈ నిల్వలు 60 రోజులకు మాత్రమే సరిపోతాయని అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించారు.