నవంబర్ 1న జరగనున్న వంద పట్టణ స్థానిక సంస్థల పోలింగ్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 36,351 మంది పోలీసు సిబ్బందిని మోహరిస్తోంది. వివిధ జిల్లాల్లో 671 పోలింగ్ కేంద్రాలను అత్యంత సున్నితమైనవిగా గుర్తించి వాటి వద్ద 3,355 మందితో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలుపుతున్నారు. మరో 1,233 సున్నిత కేంద్రాల కోసం మరో 4,943 మందిని సిద్ధం చేస్తున్నారు. 12,244 కేంద్రాల్లో 1న ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభవుతుంది.