హైదరాబాద్ లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా విద్యార్థులకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు మనన్ కుమార్ మిశ్రా క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు లేఖను విడుదల చేశారు. తన ఉత్తర్వుల ద్వారా విద్యార్థుల మనోభావాలను గాయపరిచి ఉంటే క్షమించాలని కోరారు. లాయర్లు, అడ్వకేట్లుగా, జడ్జిలుగా, మరికొందరు అత్యున్నత స్థానాలు అధిరోహించే సామర్థ్యం ఉన్న వారని అందుకే, వారిని క్షమాపణ కోరడం అంటే ప్రతిష్ఠకు సంబంధించిన విషయం కాదని.. విద్యార్థుల ఆందోళనలకు విలువ ఇవ్వడమే అన్నారు.