హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆర్థిక అక్రమాలపై దర్యాప్తు పూర్తి చేసిన సీఐడీ, కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఫోర్జరీ పత్రాలతో అధ్యక్ష పదవి, టెండర్లలో అక్రమాల అంశాలను పొందుపరిచింది. హెచ్‌సీఏకు ఏకంగా రూ.92.8 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు సీఐడీ పేర్కొంది. 48 వేల టికెట్లలో తేడాను గుర్తించారు. మొత్తంగా రూ.14 కోట్లను లెక్కల్లో చూపలేదు. 169 వైట్ టర్ఫ్ కూకా బుర్రా బంతుల కొనుగోలుకు రూ.19.46 లక్షలు, క్రికెటర్ల రవాణాకు వాహనాల కోసం అశోకా ట్రావెల్స్‌కు చెల్లించామంటున్న రూ.19 లక్షల సరైన రికార్డుల్లేవు.